తెలంగాణలో ముగ్గురు పోలీస్‌ ఉన్నతాధికారుల బదిలీ..

తెలంగాణలో మరోసారి పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. నిన్న 17 మంది డీఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేసిన డీజీపీ మహేందర్‌రెడ్డి తాజాగా మరో ముగ్గురు పోలీస్‌ ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ...

తెలంగాణలో ముగ్గురు పోలీస్‌ ఉన్నతాధికారుల బదిలీ..

Updated on: Nov 16, 2020 | 11:27 PM

తెలంగాణలో మరోసారి పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. నిన్న 17 మంది డీఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేసిన డీజీపీ మహేందర్‌రెడ్డి తాజాగా మరో ముగ్గురు పోలీస్‌ ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎల్బీనగర్‌ ఏసీపీగా కొనసాగుతున్న పృథ్వీదర్‌రావును ఇంటలిజెన్స్‌ డీఎస్పీగా బదిలీ చేశారు. ఇంటలిజెన్స్‌ డీఎస్పీగా పని చేస్తున్న కే.పురుషోత్తం రెడ్డిని వనస్థలిపురం ఏసీపీగా నియమించారు. రామగుండం సీసీఎస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌‌గా పని చేస్తున్న మహేశ్వను డయల్‌ 100 సీఐడీ, డీఎస్పీగా నియమించారు.