విమాన ప్రయాణాలకు మరిన్ని నిబంధనలు.. ఒకే కుటుంబం వారికి..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. కాగా.. లాక్ డౌన్ సడలింపులతో, ప్రభుత్వ నిబంధనలతో దేశీయ విమాన ప్రయాణాలు మొదలయ్యాయి. అయితే విమాన ప్రయాణాలపై

విమాన ప్రయాణాలకు మరిన్ని నిబంధనలు.. ఒకే కుటుంబం వారికి..

Edited By:

Updated on: Jun 01, 2020 | 7:04 PM

DGCA: కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. కాగా.. లాక్ ‌డౌన్ సడలింపులతో, ప్రభుత్వ నిబంధనలతో దేశీయ విమాన ప్రయాణాలు మొదలయ్యాయి. అయితే విమాన ప్రయాణాలపై డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కచ్చితమైన నిబంధనలు పాటించాలని సూచించింది. విమానయానంలో సామజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఒకవేళ రద్దీ లేకపోతే మధ్య సీటు ఖాళీగా వదిలేయాలని ఆదేశించారు. ఒకే కుటుంబానికి చెందినవారైతే పక్కపక్కనే కూర్చునేందుకు అనుమతి ఇచ్చారు. రద్దీ ఎక్కువైన సందర్భంలో ప్రయాణికులకు అదనపు రక్షణ కల్పించాలని ఆదేశించారు. పీపీఈ కిట్ తరహా గౌన్లను మధ్య సీటులో ప్రయాణికులకు ఇవ్వాలని డీజీసీఏ పేర్కొంది.

Also Read: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం.. మార్గదర్శకాలు ఇవే!