భవాని దీక్షల విరమణ కోసం పోటెత్తిన భక్తులు!
భవాని దీక్ష విరమణకోసం మొదటి రోజు బుధవారం వేలాది మంది భక్తులు బెజవాడ కనకదుర్గ ఆలయానికి వచ్చారు. దీక్షలో ఉన్న భక్తులు దుర్గా ఘాట్ వద్ద స్నానం చేసి, మల్లికార్జున పేట నుండి చిట్టినగర్ వరకు ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ కాలినడకన తిరిగి వస్తారు. భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు ఐదు రోజులపాటు జరుగనున్నాయి. వివిధ రాష్ట్రాలనుండి దాదాపు ఆరు లక్షల మంది భక్తులు వస్తారని ఒక అంచనా. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ పరిపాలనా […]

భవాని దీక్ష విరమణకోసం మొదటి రోజు బుధవారం వేలాది మంది భక్తులు బెజవాడ కనకదుర్గ ఆలయానికి వచ్చారు. దీక్షలో ఉన్న భక్తులు దుర్గా ఘాట్ వద్ద స్నానం చేసి, మల్లికార్జున పేట నుండి చిట్టినగర్ వరకు ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ కాలినడకన తిరిగి వస్తారు. భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు ఐదు రోజులపాటు జరుగనున్నాయి. వివిధ రాష్ట్రాలనుండి దాదాపు ఆరు లక్షల మంది భక్తులు వస్తారని ఒక అంచనా. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ పరిపాలనా విభాగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. కాగా.. పర్యావరణానికి ఎంతో హానికరమైన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లను, కవర్లను ఆలయ పరిసరాల్లో నిషేధిస్తున్నట్లు ఈవో సురేష్ బాబు తెలిపారు.