గతేడాదితో పోలిస్తే 135 శాతం పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు.. తగ్గిన మర్డర్ కేసులు.. పూర్తి వివరాలు..

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలిస్తే ఈ ఏడాది 6.65 శాతం క్రైమ్ రేట్ పెరిగిందని సీపీ సజ్జనార్ తెలిపారు. 2019తో పోల్చుకుంటే సైబర్ క్రైమ్

గతేడాదితో పోలిస్తే 135 శాతం పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు.. తగ్గిన మర్డర్ కేసులు.. పూర్తి వివరాలు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 29, 2020 | 12:36 PM

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలిస్తే ఈ ఏడాది 6.65 శాతం క్రైమ్ రేట్ పెరిగిందని సీపీ సజ్జనార్ తెలిపారు. 2019తో పోల్చుకుంటే సైబర్ క్రైమ్ నేరాలు 135 శాతం వరకు పెరిగాయన్నారు. అంతేకాకుండా ఆర్థిక నేరాలు 42 శాతం పెరిగాయని.. హత్యలు, హత్యాయత్నాల కేసులు 8 శాతం తగ్గాయని తెలిపారు. అటు నగరంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే దోపిడీలు, చోరీలు 12 శాతం తగ్గాయన్నారు. 2020లో మహిళలపై దాడులు 2302 కేసులు నమోదయ్యాయి. అంటే 2019తో పోల్చుకుంటే 18.66 శాతం తగ్గయని చెప్పారు. అటు రోడ్డు ప్రమాదాల కేసులు 625 నమోదు కాగా.. గత సంవత్సరంతో పోలీస్తే 22.7 శాతం తగ్గాయని తెలిపారు. చిన్న పిల్లల వేధింపుల కేసులు ఈసారి 559 నమోదు అయ్యాయి. 2020లో కేవలం 76 మర్డర్ కేసులు నమోదు కాగా.. గతేడాదితో పోలీస్తే 25 శాతం తగ్గాయని తెలిపారు. హైదరాబాద్‏లో న్యూఇయర్ వేడుకలను అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.