అమెరికా హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ లో 80 ఏళ్ళ నాన్సీ పెలోసీ స్పీకర్ గా మళ్ళీ ఎన్నికయ్యారు. అయితే ఇదేమీ ‘ఘన విజయం’ కాదు. ఐదుగురు డెమొక్రాట్లు ‘ఫిరాయించారు’. పైగా ఓటింగ్ సందర్భంగా తాము ‘ప్రెజెంట్’ అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. ఆ కార్యక్రమంలో మరెవరో ఓటు వేసిన కలరింగ్ ఇచ్చారు. మొత్తానికి షాకైతే ఇచ్చారు గానీ, పెలోసీ ఎన్నికను అడ్డుకోలేకపోయారు. నాన్సీ గండం నుంచి గట్టెక్కి 216 ఓట్లను సాధించగా..ఆమెపై పోటీ చేసిన రిపబ్లికన్ లీడర్ కెవిన్ మెక్ కి 209 ఓట్లు వచ్చాయి. అసలు మళ్ళీ తను స్పీకర్ గా ఎన్నికవుతానా అని భయపడిన పెలోసీ మొత్తానికి కుదుట పడ్డారు. ఇక ఈ ఎన్నిక అనంతరం మాట్లాడిన ఆమె.. అత్యంత అసాధారణమైన క్లిష్ట పరిస్థితుల్లో కొత్త కాంగ్రెస్ ను ప్రారంభిస్తున్నామని, దేశంలో ప్రబలిన కోవిడ్ మహమ్మారిని జయించగలమన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు.
కాంగ్రెస్ లో అధ్యక్షుడు ట్రంప్ కు బద్డ విరోధి అయిన పెలోసీ.. ఎన్నో సందర్భాల్లో ఆయనను విమర్శించడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. లోగడ ఆయనపై అభిశంసించేందుకు ప్రయత్నించినా ఆయన ఆ గండం నుంచి గట్టెక్కడం గమనార్హం.
Also Read :బీహార్ అసెంబ్లీ స్పీకర్ గా విజయ్ సిన్హా ఎన్నిక, 51 ఏళ్ళ తరువాత బీజేపీకే పదవీ యోగం