Delhi Violence: ఢిల్లీ అల్లర్లు.. కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్..

|

Feb 26, 2020 | 2:55 PM

సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. గత రెండు, మూడు రోజులుగా చోటుచేసుకున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో కాల్పులు జరిపిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

Delhi Violence: ఢిల్లీ అల్లర్లు.. కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్..
Follow us on

Delhi Violence: సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. గత రెండు, మూడు రోజులుగా చోటుచేసుకున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పురా, కరావల్‌ నగర్‌, జాఫరాబాద్, చాంద్‌బాగ్‌ ప్రాంతాల్లో ఆందోళనకారులు షాపులు, వాహనాలకు నిప్పంటించారు. దీంతో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి బాష్పవాయువును ప్రయోగించారు. అయినా కూడా పరిస్థితులు చేయి దాటిపోవడంతో పోలీసులు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో కాల్పులు జరిపిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు షాదార ప్రాంతానికి చెందిన 33 ఏళ్ళ షారుఖ్‌‌గా గుర్తించారు.

Also Read: Polluted India:కాలుష్య భూతం కోరల్లో ఇండియా.. టాప్ ప్లేస్‌లో 21 నగరాలు..!

జఫ్రాబాద్ ప్రాంతంలో ఎరుపు రంగు టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి ఆందోళనకారుల మధ్య నుంచి వచ్చి వారిపైనే కాల్పులు జరిపాడని.. ఆ తర్వాత మళ్ళీ తిరిగి గుంపులో కలిసిపోయాడని.. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై కూడా తుపాకీ గురిపెట్టాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతోంది. దానిని ఆధారంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి షారుఖ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఆయుధ చట్టం కింద కేసును కూడా నమోదు చేశారు.

Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాజధాని ప్రాంతంలో అర్హులకు ఇళ్ల స్థలాలు!

మరోవైపు ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి 7.00 గంటల నుంచి 10.00 గంటల వరకు ఈ భేటీ కొనసాగింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్,లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, ఢిల్లీ పోలీసు చీఫ్‌ అమూల్య పట్నాయక్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కాగా, ఇప్పటివరకు ఈ ఆందోళనల్లో 18 మంది మృతి చెందగా.. 150 మందికి పైగా గాయాలపాలయ్యారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ ప్రాంతాల్లో బుధవారం జరగాల్సిన టెన్త్, సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.