బిగ్ బ్రేకింగ్: ఫిబ్రవరి 1న, నిర్భయ దోషులకు ఉరి కన్‌ఫర్మ్!

నిర్భయ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1, ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు తాజాగా  డెత్ వారెంట్ జారీ చేసింది. సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తిరస్కరించారు. ముఖేశ్‌ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ నిన్న రాష్ట్రపతి భవన్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ముఖేశ్‌ దరఖాస్తును […]

బిగ్ బ్రేకింగ్: ఫిబ్రవరి 1న, నిర్భయ దోషులకు ఉరి కన్‌ఫర్మ్!

Edited By:

Updated on: Jan 17, 2020 | 7:05 PM

నిర్భయ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1, ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు తాజాగా  డెత్ వారెంట్ జారీ చేసింది. సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తిరస్కరించారు. ముఖేశ్‌ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ నిన్న రాష్ట్రపతి భవన్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ముఖేశ్‌ దరఖాస్తును రాష్ట్రపతి నేడు తిరస్కరించినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. తిహాడ్‌ జైలు అధికారులకు కూడా ఈ సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలిపాయి.

[svt-event date=”17/01/2020,5:03PM” class=”svt-cd-green” ]