ఢిల్లీ సరిహద్దులు.. వారం పాటు మూసివేత..

| Edited By:

Jun 01, 2020 | 2:40 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో వారం రోజులపాటు ఢిల్లీ సరిహద్దులను మూసివేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. నిత్యవసరాలకు

ఢిల్లీ సరిహద్దులు.. వారం పాటు మూసివేత..
Follow us on

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో వారం రోజులపాటు ఢిల్లీ సరిహద్దులను మూసివేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. నిత్యావసరాలకు మాత్రం అవకాశం ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై ప్రజల నుంచే సూచనలు తీసుకుంటామని అన్నారు. దీనికోసం 8800007722 వాట్సాప్ నంబర్, 1031 టోల్ ఫ్రీ నంబర్ కేటాయించామని, వచ్చే శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు సూచనలు ఇవ్వొచ్చని తెలిపారు.

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో ఇప్పటికే 20,000 కరోనా కేసులు నమోదయ్యాయి. 473 మంది మరణించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఢిల్లీ సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఒక్క రోజులోనే 1000 కేసులు నమోదు కావడంతో సీఎం కేజ్రీవాల్ తాజా ఆదేశాలు జారీ చేశారు. కరోనా పేషంట్లకు ఇబ్బంది లేకుండా చూస్తామని… ప్రతి పేషంట్‌కు ఓ బెడ్ కచ్చితంగా ఏర్పాటు చేస్తామని … ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

Also Read: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం.. మార్గదర్శకాలు ఇవే!