మోగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా..

| Edited By: Srinu

Jan 06, 2020 | 4:23 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనుండగా.. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 11న జరుగుతుంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 13,767 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 90 వేల మంది సిబ్బంది పని చేయనుండగా.. ఎన్నికల కోడ్ ఈ రోజు నుంచే అమలులోకి వచ్చింది. మొత్తం 1.46 కోట్ల ఓటర్లు ఈ ఎన్నికల్లో […]

మోగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా..
Follow us on

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనుండగా.. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 11న జరుగుతుంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 13,767 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 90 వేల మంది సిబ్బంది పని చేయనుండగా.. ఎన్నికల కోడ్ ఈ రోజు నుంచే అమలులోకి వచ్చింది.

మొత్తం 1.46 కోట్ల ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఢిల్లీ సీఈఓ రణబీర్ సింగ్ ఈ మధ్యాహ్నం ఈ విషయాన్ని ప్రకటించారు. నగరంలో 80.56 లక్షల మంది పురుష ఓటర్లు.. 66.35 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారని ఆయన అన్నారు. గత ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఈ నగరంలో జరుగుతున్న మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవే.

ఇకపోతే గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలుపొందింది. ఇక ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 22తో ముగియనుంది. కాగా, నామినేషన్ల గడువు ఈ నెల 21తో ముగుస్తోంది.