10 ల‌క్ష‌ల హ్యాండ్ గ్రేనేడ్ల‌ కొనుగోలుకు రక్షణశాఖ గ్నీన్ సిగ్నల్

| Edited By:

Mar 20, 2019 | 4:25 PM

న్యూఢిల్లీ : భారత ఆర్మీ చేతిలోకి అధునాతన అస్త్రాలు చేరనున్నాయి. యుద్ధ సమయంలో శత్రుమూకలపై దాడి చేయడమే కాకుండా.. ప్రత్యర్ధుల బంకర్లను ధ్వంసం చేయడంలో కీలకంగా ఉండే హ్యాండ్ గ్రేనేడ్‌లు రానున్నాయి. ఇందుకోసం సుమారు 10 ల‌క్ష‌ల హ్యాండ్ గ్రేనేడ్ల‌ కొనుగోలుకు ర‌క్ష‌ణ‌శాఖ నుంచి ఇవాళ‌ క్లియ‌రెన్స్ ల‌భించింది. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఈ గ్రేనేడ్ల డీల్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్‌తో జ‌రిగిన స‌మావేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. యుద్ధం […]

10 ల‌క్ష‌ల హ్యాండ్ గ్రేనేడ్ల‌ కొనుగోలుకు రక్షణశాఖ గ్నీన్ సిగ్నల్
Follow us on

న్యూఢిల్లీ : భారత ఆర్మీ చేతిలోకి అధునాతన అస్త్రాలు చేరనున్నాయి. యుద్ధ సమయంలో శత్రుమూకలపై దాడి చేయడమే కాకుండా.. ప్రత్యర్ధుల బంకర్లను ధ్వంసం చేయడంలో కీలకంగా ఉండే హ్యాండ్ గ్రేనేడ్‌లు రానున్నాయి. ఇందుకోసం సుమారు 10 ల‌క్ష‌ల హ్యాండ్ గ్రేనేడ్ల‌ కొనుగోలుకు ర‌క్ష‌ణ‌శాఖ నుంచి ఇవాళ‌ క్లియ‌రెన్స్ ల‌భించింది. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఈ గ్రేనేడ్ల డీల్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్‌తో జ‌రిగిన స‌మావేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. యుద్ధం స‌మ‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండేందుకు భార‌త్ త‌న ఆయుధ బండాగారాన్ని పెంచుకుంటున్న‌ది. హెచ్ఈ 36 గ్రేనేడ్ల స్థానంలో.. కొత్త గ్రేనేడ్ల‌ను తీసుకురావాల‌ని ఆర్మీ ఆలోచిస్తున్న‌ది. శత్రువుల టార్గెట్ల‌ను పేల్చేందుకు హ్యాండ్ గ్రేనేడ్ల‌ను వాడుతారు. శ‌త్రు బంక‌ర్ల‌ను పేల్చేందుకూ వీటిని వినియోగిస్తారు. ఇటీవ‌ల సిగ్ సార్ అజాల్ట్ రైఫిళ్ల‌ను కొనుగోలు చేయాల‌ని ర‌క్ష‌ణ‌శాఖ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఏకే203 రైఫిళ్ల త‌యారీ కోసం కూడా ర‌ష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న‌ది.