Rajnath Singh Prayers at Amarnath Temple : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పర్యటన లడఖ్, జమ్ముకశ్మీర్‌లో కొసాగుతోంది. మొదటి రోజు లేహ్‌లో పర్యటించిన రక్షణ మంత్రి ఈ రోజు జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత అమర్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అమర్‌నాథ్ ఆలయంలోని మంచు లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
#WATCH Defence Minister Rajnath Singh, Chief of Defence Staff General Bipin Rawat, and Army Chief General MM Naravane offered prayers at Amarnath Temple, earlier today pic.twitter.com/jI3HB5ZJAg
— ANI (@ANI) July 18, 2020
రాజ్‌నాథ్ వెంట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే కూడా అమర్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం నియంత్రణ రేఖలోని కుప్వారా వద్ద ఆర్మీ ఫార్వర్డ్ పోస్టుకు చేరుకున్నారు. అక్కడి సైనికులతో సమావేశం అయ్యారు. అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రవాద ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ పర్యటన జరపడం విశేషం.
Visited a forward post near LoC in Kupwara District of Jammu-Kashmir today and interacted with the soldiers deployed there. We are extremely proud of these brave and courageous soldiers who are defending our country in every situation: Defence Minister Rajnath Singh pic.twitter.com/vPjAJJD2Je
— ANI (@ANI) July 18, 2020
జూలై 21న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా, దీనికి నాలుగు రోజుల ముందే శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఉగ్రయత్నాలను బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో జైషే మహమ్మద్ స్వయం ప్రకటిత కమాండర్ సహా ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి.