52 గంటలపాటు శిథిలాల కిందే తల్లీకొడుకు..

|

Mar 10, 2020 | 1:37 PM

చైనాలోని క్వాంజై  నగరంలో కరోనా నిర్బంధ కేంద్ర భవనం కుప్పకూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 20 కి పెరిగిందని స్థానిక అధికారులు మంగళవారం తెలిపారు. ఆ శిథిలాల కింద చిక్కుకున్న 10 సంవత్సరాల బాలుడు, అతడి తల్లిని సోమవారం రాత్రి ఘటన జరిగిన 52 గంటల సురక్షితంగా బయటకు తీసినట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగిస్తున్నారు అధికారులు. క్వాన్‌జౌ నగరంలోని లిచెంగ్ జిల్లాలోని  కరోనావైరస్ నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా.. వైరస్ సోకినవారిని, వ్యాధి బారిన […]

52 గంటలపాటు శిథిలాల కిందే తల్లీకొడుకు..
Follow us on

చైనాలోని క్వాంజై  నగరంలో కరోనా నిర్బంధ కేంద్ర భవనం కుప్పకూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 20 కి పెరిగిందని స్థానిక అధికారులు మంగళవారం తెలిపారు. ఆ శిథిలాల కింద చిక్కుకున్న 10 సంవత్సరాల బాలుడు, అతడి తల్లిని సోమవారం రాత్రి ఘటన జరిగిన 52 గంటల సురక్షితంగా బయటకు తీసినట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగిస్తున్నారు అధికారులు.

క్వాన్‌జౌ నగరంలోని లిచెంగ్ జిల్లాలోని  కరోనావైరస్ నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా.. వైరస్ సోకినవారిని, వ్యాధి బారిన పడ్డవారితో సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులను నిర్బంధించడానికి 80 గదులు ఉన్న హోటల్​ను ఉపయోగిస్తోంది చైనా ప్రభుత్వం. శనివారం అనూహ్యంగా ఈ హోటల్ కూలిపోయింది. ఆ సమయంలో హోటల్‌లో 71 మంది ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇప్పటివరకు శిథిలాల నుంచి 61 మందిని బయటకు తీయగా, వారిలో 20 మంది మరణించారు.