దసరా ఉత్సవాలు.. బెజవాడలో ట్రాఫిక్ ఆంక్షలు..!

|

Oct 15, 2020 | 9:00 AM

ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి నుంచి 25 వరకు అమలులో ఉంటాయని సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.

దసరా ఉత్సవాలు.. బెజవాడలో ట్రాఫిక్ ఆంక్షలు..!
Follow us on

ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి నుంచి 25 వరకు అమలులో ఉంటాయని సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు సిటీలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇక మూల నక్షిత్రం సందర్భంగా ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ ఉదయం వరకు ప్రకాశం బ్యారేజ్ మీదకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు. అంతేకాకుండా నగర ప్రజలకు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. (Traffic Restrictions In Vijayawada)

  • విశాఖపట్నం – హైదరాబాద్ మధ్య వాహనాలను.. హనుమాన్ జంక్షన్, నూజివీడు, మైలవరం, జీ కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లింపు
  • విశాఖపట్నం – చెన్నై మధ్య వాహనాలు.. హనుమాన్ జంక్షన్, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల మీదుగా మళ్లింపు
  • గుంటూరు – విశాఖపట్నం మధ్య వాహనాలు.. బుడంపాడు నుండి పొన్నూరు, రేపల్లె, అవనిగడ్డ, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లింపు
  • విజయవాడ – హైదరాబాద్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలను పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, చల్లపల్లి బంగ్లా, బుడమేరు వంతెన, పైపుల రోడ్, సితార, గొల్లపూడి వై-జంక్షన్, ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లింపు
  • విజయవాడ – ఇబ్రహీంపట్నం మధ్య సిటీ బస్సులను ప్రకాశం స్టాట్యూ, లో-బ్రిడ్జ్, గద్ద బొమ్మ, కె.ఆర్.మార్కెట్, పంజా సెంటర్, నెప్రో చౌక్, చిట్టినగర్, టన్నెల్, సితార, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లింపు
  • ఇబ్రహీంపట్నం నుండి గొల్లపూడి, సితార, సీవీఆర్ ఫ్లై-ఓవర్, చిట్టినగర్, నెహ్రూ చాక్, పంజా సెంటర్, కే.ఆర్ మార్కెట్‌ లో-బ్రిడ్జి, ప్రకాశం స్టాట్యూ, ఏసిఆర్, సిటీ బస్ స్టాప్‌కు అనుమతి

దసరా శరన్నవరాత్రులు: భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ ప్రదేశాలు

  • ద్విచక్ర వాహన దారుల కొరకు పార్కింగ్ ప్రదేశాలు.. 1) పద్మావతి ఘాట్, 2) ఇరిగేషన్ పర్కింగ్, 3) గద్ద బొమ్మ, 4) లోటస్ అపార్ట్ మెంట్, 5) ఆర్.టి.సి. వర్క్ షాప్ రోడ్
  • కార్ల పార్కింగ్ ప్రదేశాలు1) సీతమ్మవారి పాటలు, 2) గాంధీజీ మున్సిపల్ హై స్కూల్, 3) టి.టి.డి పార్కింగ్
  • టూరిస్ట్ బస్సుల పార్కింగ్ ప్రదేశం.. 1) పున్నమి ఘాట్ వద్ద గల పార్కింగ్ ప్రదేశం…

Also Read: 

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే.!

ఆ పాత రూపాయి నాణెంతో.. రూ. 25 లక్షలు మీ సొంతమవుతాయట!

బిగ్ బాస్ 4: ‘టాప్’ లేపుతున్న ఆ ఇద్దరు.. ఫైనల్ ఫైవ్‌లో ఎవరుంటారో.?