దారుణం.. జీతం అడిగినందుకు సేల్స్‌మ్యాన్ సజీవ దహనం

చేసిన పనికి జీతం అడిగిన ఉద్యోగిని సజీవ దహనం చేశాడు ఓ మద్యం షాపు ఓనర్. ఈ ఘటన రాజస్థాన్​ అల్వార్​ నగరంలోని ఖైర్​థల్​లో జరిగింది.

దారుణం.. జీతం అడిగినందుకు సేల్స్‌మ్యాన్ సజీవ దహనం

Updated on: Oct 26, 2020 | 9:17 PM

చేసిన పనికి జీతం అడిగిన ఉద్యోగిని సజీవ దహనం చేశాడు ఓ మద్యం షాపు ఓనర్. ఈ ఘటన రాజస్థాన్​ అల్వార్​ నగరంలోని ఖైర్​థల్​లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కమలేశ్​ అనే వ్యక్తి… ఉపాధి కోసం ఓ మద్యం షాపులో సేల్స్‌మ్యాన్ పనిలో చేరాడు. తాను చేసిన కష్టానికి ఓనర్  జీతం చెల్లించకపోయిన..ఇస్తాడులే అన్న నమ్మకంతో ఐదు నెలలు పని చేశాడు. అయినా ఓనర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో విసిగివేసారిపోయిన కమలేశ్ తన జీతం చెల్లించాలని డిమాండ్​ చేశాడు​.

జీతం ఇవ్వలేదు సరికదా… కమలేశ్​పై పెట్రోలు పోసి నిప్పంటించాడు యజమాని. ఇందుకు కమలేశ్​ సహచరులు కూడా సహకరించారు. తనను తాను రక్షించుకోవడానికి డీప్​ ఫ్రిజ్​లోకి వెళ్లాడు బాధితుడు​. అప్పటికే పూర్తిగా కాలిపోయిన కమలేశ్​… అందులోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.  చనిపోయిన వ్యక్తి దళితుడు కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారింది.  అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లిందని ఆరోపించాయి.

Also Read :

సినిమాను తలదన్నే సీన్.. చిన్నారిని కాపడటానికి నాన్-స్టాప్‌గా 200 కి.మీ…

మ్యారేజ్ బ్యూరోలో కేవలం రైతులకు మాత్రమే సంబంధాలు చూడబడును

Follow Us