అగ్రవర్ణాల ముందు అన్నం తిన్నందుకు… ఆ దళితుడ్ని…

| Edited By:

May 07, 2019 | 4:32 PM

అగ్రకులస్థుల ముందు కూర్చొని అన్నం తినడమే.. ఆ దళితుడి పాలిట శాపంగా మారింది. ఇందుకు ఆ దళితుడిపై దాడికి దిగారు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని తెహ్రీ జిల్లాలో చోటుచేసుకుంది. ఏప్రిల్ 26న శ్రీకోట్ గ్రామంలోని ఓ వివాహ వేడుకకు హాజరైన జితేంద్ర అనే ఓ దళితుడు.. ఆ పెళ్లి విందులో అక్కడే కూర్చొని భోజనం చేశాడు. అయితే అతడి ఎదురుగా కూర్చొని భోజనం చేస్తున్న అగ్రకులస్థులు.. తమతో సమానంగా జితేంద్ర కూర్చోవడాన్ని సహించలేకపోయారు. ఆగ్రహం […]

అగ్రవర్ణాల ముందు అన్నం తిన్నందుకు... ఆ దళితుడ్ని...
Follow us on

అగ్రకులస్థుల ముందు కూర్చొని అన్నం తినడమే.. ఆ దళితుడి పాలిట శాపంగా మారింది. ఇందుకు ఆ దళితుడిపై దాడికి దిగారు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని తెహ్రీ జిల్లాలో చోటుచేసుకుంది. ఏప్రిల్ 26న శ్రీకోట్ గ్రామంలోని ఓ వివాహ వేడుకకు హాజరైన జితేంద్ర అనే ఓ దళితుడు.. ఆ పెళ్లి విందులో అక్కడే కూర్చొని భోజనం చేశాడు. అయితే అతడి ఎదురుగా కూర్చొని భోజనం చేస్తున్న అగ్రకులస్థులు.. తమతో సమానంగా జితేంద్ర కూర్చోవడాన్ని సహించలేకపోయారు.

ఆగ్రహం పట్టలేక జితేంద్రపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. తొమ్మిది రోజులు చికిత్స పొంది.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. జితేంద్ర హత్యపై అతడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న వారు..  దర్యాప్తు జరిపి.. ఘటనకు సంబంధించిన ఏడుగురు నిందితులను గుర్తించారు. వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా.. మిగతావారి ఆచూకి కోసం గాలిస్తున్నారు.