పూరీని వణికిస్తున్న ‘ఫొని’ తుఫాన్..ఏపీకి తప్పిన పెనుముప్పు

|

May 03, 2019 | 12:07 PM

ప్రచండ తుఫాన్ ‘ఫొని’ ఒడిశాలోని పూరీ సమీపంలో తీరాన్ని తాకింది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఒడిశా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 200 కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. రాకాసి గాలుల ధాటికి చెట్లు, స్తంభాలు కూలిపోతాయని..ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. తుఫాన్ దిశ మార్చుకోవడంతో ఏపీకి పెను ముప్పు తప్పింది. అయితే ఉత్తరాంధ్రను ఈ తుఫాన్ ప్రభావం ఇంకా […]

పూరీని వణికిస్తున్న ఫొని తుఫాన్..ఏపీకి తప్పిన పెనుముప్పు
Follow us on

ప్రచండ తుఫాన్ ‘ఫొని’ ఒడిశాలోని పూరీ సమీపంలో తీరాన్ని తాకింది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఒడిశా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 200 కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. రాకాసి గాలుల ధాటికి చెట్లు, స్తంభాలు కూలిపోతాయని..ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. తుఫాన్ దిశ మార్చుకోవడంతో ఏపీకి పెను ముప్పు తప్పింది. అయితే ఉత్తరాంధ్రను ఈ తుఫాన్ ప్రభావం ఇంకా వీడలేదు. ఈదురు గాలులు, వర్షాలతో కొన్ని జిల్లాలు తల్లడిల్లుతున్నాయి.