సైబరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్.. సెల్ఫీస్టార్‌గా మారిపోయారు. ఆయన బయట కనిపిస్తే చాలు.. అందరూ సెల్ఫీలు కావాలంటూ ఎగబడుతున్నారు. తాజాగా ఆయన ఏపీలో పర్యటించారు. అనంతపురం జిల్లా లేపాక్షిలో ఉన్న వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. సంప్రదాయ పంచెకట్టు, లాల్చి ధరించి, కుటుంబీకులతో కలిసి ఆలయానికి వచ్చారు సజ్జనార్. ఆలయ అర్చకులు ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఆలయంలో పూజ పూర్తి చేసుకుని బయటకు వస్తుండగా.. ఆయనపై పూలు జల్లుతూ.. సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు.
తాజాగా.. తెలంగాణలోని చటాన్ పల్లిలో జరిగిన దిశ హత్యాచారం కేసులోని నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు సంపాదించారు. దీంతో.. ఒక్కసారిగా ఆయన సోషల్‌మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయారు. అందుకే సజ్జనార్ ఎక్కడికి వెళ్లినా.. యూత్ సెల్ఫీలు దిగుతూ పోస్టులు పెడుతున్నారు.