నేడు తెలుగురాష్ట్రాల సీఎంల భేటీ

|

Jun 28, 2019 | 7:24 AM

ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్ ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు ప్రగతి భవన్‌లో భేటీ కానున్నారు. కృష్ణా, గోదావరి జలాలను రెండు రాష్ట్రాలకు ఎలా పంపిణీ చేసుకోవాలి.? పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, ఉద్యోగుల విభజన, ఆర్టీసీ, విద్యుత్ వంటి కీలక సంస్థల విభజన పై చర్చిస్తారు. ప్రస్తుతం 800 మంది తెలంగాణ ఉద్యోగులు ఏపీలో పనిచేస్తుండగా.. వారిని స్వరాష్ట్రానికి రప్పించడంపైనా ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కూడా […]

నేడు తెలుగురాష్ట్రాల సీఎంల భేటీ
Follow us on

ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్ ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు ప్రగతి భవన్‌లో భేటీ కానున్నారు. కృష్ణా, గోదావరి జలాలను రెండు రాష్ట్రాలకు ఎలా పంపిణీ చేసుకోవాలి.? పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, ఉద్యోగుల విభజన, ఆర్టీసీ, విద్యుత్ వంటి కీలక సంస్థల విభజన పై చర్చిస్తారు. ప్రస్తుతం 800 మంది తెలంగాణ ఉద్యోగులు ఏపీలో పనిచేస్తుండగా.. వారిని స్వరాష్ట్రానికి రప్పించడంపైనా ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు తుది నిర్ణయం తీసుకోనున్నారు.