స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా.. ఫేక్ ఆడియోతో.. తొలి క్రికెట్ మ్యాచ్..!

కోవిద్-19 కారణంగా నిలిచిపోయిన క్రికెట్ మ్యాచ్‌లు మళ్లీ మెల్లిమెల్లిగా పట్టాలెక్కుతున్నాయి. సౌతంప్టన్‌లో జూలై 8 నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టెస్టుల్లో భాగంగా తొలి మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ జరిగినప్పటికీ

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా.. ఫేక్ ఆడియోతో.. తొలి క్రికెట్ మ్యాచ్..!
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2020 | 6:30 AM

కోవిద్-19 కారణంగా నిలిచిపోయిన క్రికెట్ మ్యాచ్‌లు మళ్లీ మెల్లిమెల్లిగా పట్టాలెక్కుతున్నాయి. సౌతంప్టన్‌లో జూలై 8 నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టెస్టుల్లో భాగంగా తొలి మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ జరిగినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ అభిమానులను అనుమతించే పరిస్థితులు లేవు. ఇరు జట్ల అభిమానులు ఉంటే ఆ క్రేజే వేరు. సిక్స్ కొట్టినా, సెంచరీలు చేసినా, వికెట్ పడినా కేకలు, ఈలలతో స్టేడియం హోరెత్తిపోతుంది. కరోనా.. పుణ్యమా అని ఇప్పుడా పరిస్థితి లేదు. అందువల్ల నిర్వాహకులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

స్టేడియంలో ప్రేక్షకులు లేని కారణంగా.. క్రీడాకారుల్లో జోష్ నింపడానికి క్రికెట్ ఫ్యాన్స్ కేకలు, ఈలలతో నింపిన ఫేక్ ఆడియోను మ్యాచ్‌లో హైలైట్ మూమెంట్స్ సందర్భంలో ప్లే చేయాలని నిర్ణయించారు. మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే అభిమానులు కూడా స్టేడియంలో ఉన్న అనుభూతిని ఆస్వాదించగలరన్నది నిర్వాహకుల ఆలోచనగా తెలిసింది. ఈ ఫేక్ శబ్దాలను ప్లే చేసేందుకు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు రెండూ ఒప్పుకున్నాయి. ఈ సరికొత్త క్రికెట్ మ్యాచ్ అనుభూతి ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. జూలై 8 వరకూ ఆగాల్సిందే.

Also Read: కర్ణాటకలో అడవుల్లో ‘బగీరా’.. వైరల్ అవుతున్న ఫోటోలు..