Crime news: హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 17 ఏళ్ల బాలుడ్ని 14 ఏళ్ల మరో బాలుడు కత్తితో పొడిచాడు. కత్తిపోట్లతో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి చేర్చారు. ఓ మిర్చి బండి వద్ద ఇద్దరు మిర్చీలు తింటుండగా వివాదం తలెత్తిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో వారు గొడవ పడి, అది కొట్టుకొనే వరకూ వెళ్లిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే 14 ఏళ్ల బాలుడు కత్తితో పొడిచినట్లు తెలిపారు.
కాగా.. పొట్టలో తీవ్ర గాయాలపాలైన బాలుడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కత్తితో పొడిచిన 14 ఏళ్ల బాలుడు పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఘటనపై బాలుడ్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. కత్తితో పొడిచిన బాలుడి తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు రప్పించి ప్రశ్నిస్తున్నారు.