Crime: మంగళవారం ముంబైలో దారుణం చోటుచేసుకుంది. తనకు రావాల్సిన చిల్లర అడిగినందుకు ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై బోరివాలికి చెందిన రామ్‌దులర్ సింగ్ యాదవ్(68) అనే వ్యక్తి మంగళవారం గ్యాసు నింపించుకోవటానికి దగ్గరలోని మగథానే సీఎన్‌జీ గ్యాస్ స్టేషన్‌కు వెళ్లాడు. గ్యాస్ నింపించుకుని, డబ్బులు చెల్లించిన తర్వాత తనకు రావాల్సిన 5 రూపాయల చిల్లర అడిగాడు. దీంతో అక్కడ పనిచేసే కొందరు రామ్‌ను చుట్టుముట్టి తిట్టడం ప్రారంభించారు.
తరువాత యాదవ్ ను దారుణంగా చితకబాది అక్కడినుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ అతడు కొద్దిసేపటికే మరణించాడు. బుధవారం రామ్ కుమారుడు సంతోష్ యాదవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు కారణమైన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.