గుడ్ న్యూస్.. సెప్టెంబర్‌లో ఇండియాలో క్రికెట్ పునఃప్రారంభం..!
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్తంభించిపోయిన క్రీడారంగం ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమవుతోంది. తాజాగా ఇంగ్లాండ్ వెర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్ ఇందుకు నిదర్శనం.

Cricket Tournaments In India: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్తంభించిపోయిన క్రీడారంగం ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమవుతోంది. తాజాగా ఇంగ్లాండ్ వెర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్ ఇందుకు నిదర్శనం. కోవిడ్ నిబంధనల మధ్య ఈ సిరీస్ జరుగుతోంది. అటు ఐపీఎల్ కూడా సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఇండియాలో పెద్ద టోర్నీలు అన్నీ కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశముందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వివిధ క్రీడలకు సంబంధించిన పెద్ద లీగ్‌లు ఆరంభమయ్యేందుకు సిద్దంగా ఉన్నాయన్న ఆయన.. ఈ టోర్నీలు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని వెల్లడించారు.




