గుండెలు బ‌రువెక్కే ఘ‌ట‌న‌..శవం లేని చితికి నిప్పు..!

|

Apr 22, 2020 | 4:10 PM

కరోనా మహమ్మారి ఓ నిరుపేద కూలీ కుటుంబంలో ఎప్ప‌టికి మ‌రిచిపోలేని విషాదాన్ని మిగిల్చింది. యూపీలోని గోరఖ్‌పూర్‌ జిల్లా దుమ్రీఖుండ్‌ గ్రామానికి చెందిన సునిల్‌ (38) అనే వలసకూలీ ఢిల్లీలో ఇటీవల తట్టు వ్యాధితో ప్రాణాలు విడిచాడు. అతడి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ సొంత ఊర్లోనే ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆస్ప‌త్రిలో సునిల్ చ‌నిపోయిన విషయాన్ని ఈ నెల 14న అతడి ఫోన్‌ నుంచే ఢిల్లీకి చెందిన ఒక పోలీసు దుమ్రీఖండ్‌లోని కుటుంబ సభ్యుల‌కి తెలియజేశాడు. అయితే, […]

గుండెలు బ‌రువెక్కే ఘ‌ట‌న‌..శవం లేని చితికి నిప్పు..!
Follow us on

కరోనా మహమ్మారి ఓ నిరుపేద కూలీ కుటుంబంలో ఎప్ప‌టికి మ‌రిచిపోలేని విషాదాన్ని మిగిల్చింది. యూపీలోని గోరఖ్‌పూర్‌ జిల్లా దుమ్రీఖుండ్‌ గ్రామానికి చెందిన సునిల్‌ (38) అనే వలసకూలీ ఢిల్లీలో ఇటీవల తట్టు వ్యాధితో ప్రాణాలు విడిచాడు. అతడి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ సొంత ఊర్లోనే ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆస్ప‌త్రిలో సునిల్ చ‌నిపోయిన విషయాన్ని ఈ నెల 14న అతడి ఫోన్‌ నుంచే ఢిల్లీకి చెందిన ఒక పోలీసు దుమ్రీఖండ్‌లోని కుటుంబ సభ్యుల‌కి తెలియజేశాడు.

అయితే, సునిల్ డెడ్ బాడీని ఢిల్లీ నుంచి తీసుకురావాలంటే రూ.25 వేలు అవసరమని తెలిసి.. పూట గ‌డ‌వడానికి కూడా దిక్కులేని ఆ పేద కుటుంబం చివ‌రి చూపుకు నోచుకోలేమంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. ఎవ‌రినైనా అడుగుదామ‌నుకున్నా..లాక్‌డౌన్‌ ఆంక్షలు వారిని నైరాశ్యంలోకి నెట్టాయి. దీంతో.. మంగళవారం మృతదేహం లేకుండానే సునిల్‌కు గుర్తుగా ఒక నమూనా బొమ్మను తయారుచేసి చితిపై ఉంచి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు, సునిల్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం గురువారం ఢిల్లీలో అధికారులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.