క్రేజీ ఆఫర్ దక్కించుకున్న లక్కీ బ్యూటీ రష్మిక.. ఏకంగా మెగాస్టార్‌‌‌కు కూతురిగా ఛాన్స్

ప్రస్తుతం వైసిపిస్తున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల పేర్లలో రష్మిక కూడా ఒకరు . ఈ అమ్మడు టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన..

  • Rajeev Rayala
  • Publish Date - 3:54 pm, Mon, 28 December 20
క్రేజీ ఆఫర్ దక్కించుకున్న లక్కీ బ్యూటీ రష్మిక.. ఏకంగా మెగాస్టార్‌‌‌కు కూతురిగా ఛాన్స్

ప్రస్తుతం వైసిపిస్తున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల పేర్లలో రష్మిక కూడా ఒకరు . ఈ అమ్మడు టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అతితక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు దాదాపు దగ్గరయిపోయింది. వరుసగా సినిమా ఛాన్స్ లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వయ్యారి. బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తుంది ఈ చిన్నది. కాగా రష్మికకు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ దక్కింది. ఈ అమ్మడు ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ‘డెడ్లీ'( వర్కింగ్ టైటిల్)  సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తుంది. మరో వైపు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు తమ అప్ కమింగ్ సినిమాల్లో రష్మికను హీరోయిన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ  ఈసమయంలో ఈ ముద్దుగుమ్మ హిందీలో వరుస ఆఫర్లను దక్కించుకుంటుంది. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న`మిషన్ మజ్ను` చిత్రంతో రష్మిక హిందీ రంగంలో ప్రవేశిస్తోంది. ఆ వెంటనే బిగ్ బి సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. వికాశ్ బహల్ దర్శకత్వం వహిస్తున్న ‘డెడ్లీ’లో ఆఫర్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో అమితాబ్ బచ్చన్ కి కూతురిగా రష్మిక మందన నటించనుందని ప్రచారం జరుగుతుంది. మరి రష్మిక నిజంగా అమితాబచ్చన్ సినిమాలో నటిస్తుందా..? ఒకవేళ నటించిన అది అమితాబ్ కూతురి పాత్రేనా అన్నది తెలియాల్సి ఉంది.