Covid Vaccine Updates: మొదట కోటి మంది హెల్త్ వర్కర్స్ కి కోవిడ్ 19 వ్యాక్సిన్, కేంద్రం ప్రకటన.

కొవిడ్ 19 వ్యాక్సిన్ ని మొదట కోటిమంది హెల్త్ వర్కర్స్ కి ఇస్తామని కేంద్రం ప్రకటించింది. వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సిబ్బంది కూడా ఉంటారని..

Covid Vaccine Updates: మొదట కోటి మంది హెల్త్ వర్కర్స్ కి కోవిడ్ 19 వ్యాక్సిన్, కేంద్రం ప్రకటన.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 04, 2020 | 5:02 PM

కొవిడ్ 19 వ్యాక్సిన్ ని మొదట కోటిమంది హెల్త్ వర్కర్స్ కి ఇస్తామని కేంద్రం ప్రకటించింది. వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సిబ్బంది కూడా ఉంటారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. అనంతరం దాదాపు రెండు కోట్లమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. కోటిమంది హెల్త్ వర్కర్లలో డాక్టర్లు, నర్సులు, 2 కోట్లమంది ఫ్రంట్ లైన్ సిబ్బందిలో పోలీసులు, సాయుధ దళాలు, మున్సిపల్ కార్మికులు తదితరులు ఉంటారని ఆయన చెప్పారు.

స్టోరేజీ ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం.. ప్రధాని మోదీ

దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ స్టోరేజీ ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని ప్రధాని మోదీ అంతకు ముందు తెలిపారు. ఫైజర్ వ్యాక్సిన్ ని  కోల్డ్ స్టోరేజీలో ఉంచడానికి గల ఏర్పాట్లను ఇప్పటినుంచే పరిశీలించి. దీనిపై దృష్టి పెట్టాలని ఆయన వివిధ రాష్ట్రాలను కోరారు. ఈ టీకామందును మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉంచాలని, ఇంత తక్కువ ఉష్ణోగ్రతతో కూడిన కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఇలాంటి సౌకర్యాలున్న నగరాలు తక్కువగా ఉన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. వ్యాక్సిన్ స్టాక్ కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ని డెవలప్ చేసినట్టు ఆయన చెప్పారు.  టీకామందులు అందుబాటులోకి రావడానికి మరెంతో కాలం లేదని, మరికొన్ని వారాల్లో ఇవి ప్రజలను చేరుతాయని అన్నారు. దేశంలో ఎనిమిది వ్యాక్సిన్లు వివిధ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నట్టు మోదీ వెల్లడించారు.

Latest Articles
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించిన వైఎస్ భారతి
ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించిన వైఎస్ భారతి
వామ్మో.. ఈ సన్నజాజి తీగల మారిన వయ్యారిని గుర్తుపట్టారా.. ?
వామ్మో.. ఈ సన్నజాజి తీగల మారిన వయ్యారిని గుర్తుపట్టారా.. ?
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్