Covid Vaccine: మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టడం ఒక లెక్క అయితే.. దానిని ప్రపంచం మొత్తం సప్లై చేయడం మరో లెక్క అంటోంది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ). ప్రపంచవ్యాప్తంగా COVID-19 వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడానికి కనీసం 8,000 జంబో జెట్‌లు అవసరమవుతాయని హెచ్చరించింది.
ప్రపంచంలోని ప్రతీ నలుమూలలకు కోవిడ్ వ్యాక్సిన్ చేరేలా దేశాలన్నీ కూడా ప్రణాళికలు సిద్దం చేయాలని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ కోరుతోంది. వ్యాక్సిన్‌ను సురక్షితంగా పంపిణీ చేయడం ఏవియేషన్ ఇండస్ట్రీకి ఈ శతాబ్దపు అతి పెద్ద సవాల్ అని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ జునియాక్ పేర్కొన్నారు.
అయితే ఈ ప్రక్రియ విజయవంతం కావాలంటే.. ప్రభుత్వాలు పక్కాగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. భద్రతా ఏర్పాట్లు, బోర్డర్ ప్రాసెసస్ వంటి వాటిని సులభతరం చేయడంలో ప్రభుత్వాలు ముందడుగు వేయాలన్నారు. కాగా, 290 విమానయాన సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ), ఒక్కో వ్యక్తికి ఒక మోతాదుకు తగినంత డోసేజ్ రవాణా చేయడానికి 8 వేల 747 కార్గో విమానాలు అవసరమవుతాయని అంచనా వేస్తోంది.
Also Read:
ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్ టికెట్స్ వచ్చేశాయి..