మహా పోలీసులపై పగబట్టిన కరోనా.. 234 మంది మృతి

|

Sep 23, 2020 | 2:54 PM

మహారాష్ట్ర‌లో క‌రోనా బారిన‌డుతున్న పోలీసుల సంఖ్య ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. రోజురోజుకు క‌రోనా సోకుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో 253 మంది పోలీసులు క‌రోనా పాజిటివ్‌లుగా తేలింది. దీంతో ఇప్ప‌టివ‌రకు మొత్తం 21,827 మంది పోలీసులు....

మహా పోలీసులపై పగబట్టిన కరోనా.. 234 మంది మృతి
Follow us on

కరోనా మహమ్మారిపై ముందు వరసలో ఉండి పోరాడుతున్న పోలీసులకు కష్టాలు తప్పడం లేదు. వారిపై కూడా కరోనా రక్కసి పంజా విసురుతోంది. ఇందులో సామాన్య ప్రజలతోపాటు డాక్టర్లు, పోలీసులు అధికంగా బాధితులుగా మారుతున్నారు. అయితే ఈ పోరాటంలో ఇబ్బందులు పడుతున్నవారిలో ఎక్కువ మంది పోలీసులే కావడం బాధించే సంగతి.

మహారాష్ట్ర‌లో క‌రోనా బారిన‌డుతున్న పోలీసుల సంఖ్య ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. రోజురోజుకు క‌రోనా సోకుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో 253 మంది పోలీసులు క‌రోనా పాజిటివ్‌లుగా తేలింది. దీంతో ఇప్ప‌టివ‌రకు మొత్తం 21,827 మంది పోలీసులు కోవిడ్ బారిన‌ప‌డ్డారు. ఇందులో 18,158 మంది కోలుకోగా, 3435 మంది చికిత్స పొందుతున్నారని మ‌హారాష్ట్ర పోలీసు శాఖ ప్ర‌క‌టించింది. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో ఐదుగురు పోలీసులు క‌రోనాతో చ‌నిపోవ‌డంతో మొత్తం మ‌ర‌ణించిన పోలీసుల సంఖ్య 234కు చేరింది.

రాష్ట్రంలో ఈరోజు 18,390 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కొత్త‌గా 392 మంది మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 12,42,770 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. మొత్తం 33,407 మంది చ‌నిపోయారు.