కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ పంపిణీలో అసమానతలు ఉండవు!

|

Nov 11, 2020 | 4:46 PM

కోవిడ్‌-19 వాక్సిన్‌ పంపిణీలో ఎలాంటి అసమానతలు ఉండవని, అందరికీ అందిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.. టీకా పంపిణీలో కొన్ని ప్రాంతాల వారికే ప్రాధాన్యముంటుందన్న వార్తల్లో నిజం లేదని చెప్పింది.. మెట్రోలు, నగరాలలోని వారికే పెట్ట పీట వేస్తారంటూ వస్తున్న వార్తలు వదంతులేనని కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేశ్‌ భూషణ్‌ అన్నారు.. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం చూపించదని తెలిపాడు. వ్యాక్సిన్‌ ఎవరికి అవసరమో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీలోనే కాకుండా […]

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ పంపిణీలో అసమానతలు ఉండవు!
Follow us on

కోవిడ్‌-19 వాక్సిన్‌ పంపిణీలో ఎలాంటి అసమానతలు ఉండవని, అందరికీ అందిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.. టీకా పంపిణీలో కొన్ని ప్రాంతాల వారికే ప్రాధాన్యముంటుందన్న వార్తల్లో నిజం లేదని చెప్పింది.. మెట్రోలు, నగరాలలోని వారికే పెట్ట పీట వేస్తారంటూ వస్తున్న వార్తలు వదంతులేనని కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేశ్‌ భూషణ్‌ అన్నారు.. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం చూపించదని తెలిపాడు. వ్యాక్సిన్‌ ఎవరికి అవసరమో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీలోనే కాకుండా పంపిణీకి అవసరమయ్యే కోల్డ్‌ చైన్‌ ఏర్పాట్లలో కూడా ప్రభుత్వం ఎంతో ముందున్నదని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. దేశంలో ఉన్న 28 వేలకు పైగా కోల్డ్‌ చైన్‌ కేంద్రాలను, 700 శీతలీకరణ వ్యాన్‌లను, 70 వేలకు పైగా వ్యాక్సినేటర్‌ వ్యవస్థలను వ్యాక్సిన్‌ పంపిణీకి ఉపయోగించనున్నామని ఇంతకు ముందే ఆరోగ్యశాఖ ప్రకటించింది.