“భార‌త్‌లో ఈ ఏడాది చివ‌రి నాటికి క‌రోనా వ్యాక్సిన్”

ఇండియాలో ఈ ఏడాది చివ‌రినాటికి స్వ‌దేశీ క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శనివారం అన్నారు.

భార‌త్‌లో ఈ ఏడాది చివ‌రి నాటికి క‌రోనా వ్యాక్సిన్

Updated on: Aug 23, 2020 | 4:47 PM

ఇండియాలో ఈ ఏడాది చివ‌రినాటికి స్వ‌దేశీ క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శనివారం అన్నారు.

మ‌న వ‌ద్ద క‌రోనా వ్యాక్సిన్ తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోన్న కంపెనీల‌లో ఒక‌రు మూడ‌వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వహిస్తున్నారని, ఈ సంవత్సరం చివరి నాటికి వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడుతుందని త‌మ‌కు చాలా నమ్మకం ఉందని మంత్రి తెలిపారు. ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన‌ 10 పడకల తాత్కాలిక ఆసుపత్రిని ప్రారంభిస్తూ హర్షవర్ధన్ వ్యాక్సిన్ గురించి ఈ కామెంట్స్ చేశారు.

‘కోవిడ్‌పై మ‌నం యుద్దం చేయ‌బ‌ట్టి 8 నెల‌లు అవుతుంది. భారతదేశంలో వ్యాధి రికవరీ రేటు 75 శాతం ఉండ‌టం సంతోష‌క‌ర అంశం. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 2.2 మిలియన్ల మంది రోగులు కోలుకొని ఇంటికి వెళ్ళారు. మరో ఏడు లక్షలు మంది డిశ్చార్జ్ అవ్వ‌డానికి రెడీగా ఉన్నారు’ అని మంత్రి పేర్కొన్నారు.

Also Read :

వైఎస్‌ఆర్‌ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల

మ‌ర‌ణంలోనూ వీడ‌ని బంధం : భ‌ర్త మ‌ర‌ణ వార్త విని భార్య మృతి

అలెర్ట్ : ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు