Corona Vaccination: దేశవ్యాప్తంగా చురుకుగా కరోనా వ్యాక్సినేషన్.. తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన టీకా పంపిణీ

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. జూన్‌ నాటికి కరోనా కంట్రోల్ అవుతుందంటున్నారు వైద్య నిపుణులు.

Corona Vaccination: దేశవ్యాప్తంగా చురుకుగా కరోనా వ్యాక్సినేషన్.. తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన టీకా పంపిణీ
Vaccine
Follow us

| Edited By: Team Veegam

Updated on: May 22, 2021 | 9:54 PM

Corona Vaccination Drive: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. జూన్‌ నాటికి కరోనా కంట్రోల్ అవుతుందంటున్నారు వైద్య నిపుణులు. రాష్ట్రాల్లో అమలవుతున్న ఆంక్షలకు తోడు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుండటంతో కేసుల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో వ్యాక్సిన్‌కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడుతోంది. మరి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? ఇలాంటి సమాచారంపై ఓ లుక్కెద్దాం.. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. ఇదే ఇప్పుడు టీవీ9 నినాదం.. దేశం విధానం.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 కోట్ల 97 లక్షల 72 వేల 194 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 14 కోట్ల 82 లక్షల 72 వేల 557 మందికి మొదటి డోస్ అందగా.. 4 కోట్ల 14 లక్షల 99 వేల 637 మందికి రెండో డోస్ కూడా పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 7 లక్షల 99 వేల 106 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

Covid Vaccine

Covid Vaccine

తెలుగు రాష్ట్రాల్లో ఎంత మందికి వ్యాక్సిన్ అందిందనే విషయాలను గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 79 లక్షల 175 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 55 లక్షల 55 వేల 720 మందికి మొదటి డోస్ అందగా.. 23 లక్షల 44 వేల 455 మందికి రెండో డోస్ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. వారం రోజులుగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిలిచిపోయింది. ప్రస్తుతం కరోనా కట్టడితోపాటు, మూడో దశ ముప్పు తప్పాలంటే టీకా ఒక్కటే మార్గమన్న తరుణంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 3 లక్షల మందికి ఈనెల చివరినాటికి రెండో డోస్‌ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌ ప్రారంభంపై వైద్యారోగ్యశాఖ స్పష్టత ఇవ్వలేదు. గత నెలలో పలుమార్లు ఒకటి, రెండు రోజులు నిలిపివేసినప్పటికీ ఇలా ఎక్కువ రోజులు వ్యాక్సినేషన్‌ను నిలిపివేయడం ఇదే తొలిసారి.

తెలంగాణలో ఇప్పటి వరకు 55 లక్షల 24 వేల 649 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్ పూర్తైన వారు 44 లక్షల 53 వేల 87 మంది. రెండో డోస్ పూర్తైన వారు 10 లక్షల 71 వేల 562 మంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి డోస్ వ్యాక్సిన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత నెమ్మదించింది. వీరిలో అత్యధిక శాతం కొవిషీల్డ్‌ తీసుకున్నవారే. ఈ టీకా రెండో డోసు గడువును కేంద్రం 6 నుంచి 12 వారాలకు పెంచింది. ఇక ఈ నెలాఖరుకు సుమారు 3 లక్షల మంది కొవాగ్జిన్‌ రెండో డోసు తీసుకోవాల్సిన వారు ఉన్నారు. కాగా, గత శనివారం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది వైద్యారోగ్యశాఖ. మరోవైపు మూడో వేవ్‌పై హెచ్చరికతలో 18 ఏళ్లు పైబడినవారు సైతం టీకా కోసం ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించినా.. ఆ ప్రక్రియ పూర్తయి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేందుకు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Covid Vaccine

Covid Vaccine

ఇక దేశ వ్యాప్తంగా రెండు కంపెనీల వ్యాక్సిన్లు మనకు అందుతున్నాయి. అందులో ఏ కంపెనీ నుంచి ఎన్ని వ్యాక్సినేషన్లు పూర్తయ్యాయి అనే వివరాలు చూస్తే.. 16 కోట్ల 93 లక్షల 94 వేల 665 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ అందగా.. 2 కోట్ల 3 లక్షల 77 వేల 254 మందికి కోవాగ్జిన్ డోసులు అందాయి. ఇక ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలు చూస్తే.. 22 కోట్ల 82 లక్షల 29 వేల 777 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 8 కోట్ల 62 లక్షల 59 వేల 207 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 14 కోట్ల 19 లక్షల 70 వేల 570 మంది 45 ఏళ్ల పై బడిన వారు.

అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి వ్యాక్సిన్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? లేదంటే.. ఇప్పుడు కోవిన్ పోర్టల్‌ను ఓపెన్ చేయండి…

Read Also…  Covid-19 Vaccine: వ్యాక్సిన్ వేసుకున్న ఫొటో పంపండి.. 5 వేలు గెలుచుకోండి..! ( వీడియో )

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!