కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..

|

Jul 03, 2020 | 6:59 PM

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ 'కోవాగ్జిన్' టీకాను ఆగష్టు 15 కల్లా మార్కెట్‌లోకి విడుదల చేయాలని ఐసీఎంఆర్ భావిస్తోంది.

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..
Follow us on

Covid 19 Indian Vaccine Trails Set To Begin: మానవజాతిని భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ‘కోవాగ్జిన్’ టీకాను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. క్లినికల్ ట్రయిల్స్ వేగవంతం చేసి దీన్ని ఆగష్టు 15 కల్లా మార్కెట్‌లోకి విడుదల చేయాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ వ్యాక్సిన్‌పై ప్రయోగాలు నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని రెండు కేంద్రాలతో పాటుగా దేశంలో మొత్తంగా 12 సెంటర్లను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది.

ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌ను ఎంపిక చేసిన ఐసీఎంఆర్.. వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు నోడల్ ఆఫీసర్‌గా కేజీహెచ్ డాక్టర్ వాసుదేవ్‌ను నియమించింది. అలాగే తెలంగాణలో క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించేందుకు నిమ్స్‌కు ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది. దీనికి నోడల్ ఆఫీసర్‌గా డాక్టర్ ప్రభాకర్ రెడ్డిని నియమించింది. అటు బెలగావి జీవన్ సఖి మల్టీస్పెషలిటీ హాస్పిటల్, ఎయిమ్స్ ఢిల్లీ, హైదరాబాద్ బ్రాంచ్‌లతో పాటు గోరఖ్‌పూర్ రానా హాస్పిటల్ తదితర వాటిల్లో క్లినికల్ ట్రయిల్స్‌ నిర్వహించేందుకు ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read: బ్రేకింగ్: చైనాలో మరో కొత్త వైరస్.. మానవజాతికి మరో డేంజర్..