COVID-19: ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొన్నటివరకు ఆకాశమే హద్దుగా ఉన్న చికెన్, మటన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. కరోనా దెబ్బకు బ్రాయిలర్ కోళ్ల మార్కెట్ కుప్పకూలింది. ధరలు భారీగా పడిపోయాయి. జనవరి మార్కెట్ కంటే 30 రూపాయలకు పైగా ధర తగ్గింది. భారీగా నష్టాలను మూటగట్టుకోవాల్సి రావటంతో రైతులు అల్లాడుతున్నారు. ఆదివారం అయినప్పటికీ చికెన్‌కి పబ్లిక్ బ్రేకప్ చెప్పింది. కరోనా ఎఫెక్ట్‌తో 60% చికెన్ రేట్లు తగ్గాయి. సోషల్ మీడియాలో వస్తున్నా దుష్ప్రచారాలు యానిమల్ హస్బెండ్రీ కమీషనర్ కొట్టిపడేస్తున్నారు. బాయిలర్ చికెన్ రేట్లు తగ్గడంతో, సీ ఫుడ్‌కి డిమాండ్ పెరిగింది.
కరోనా వైరస్ చికెన్, మటన్, గుడ్ల ద్వారా వ్యాప్తి చెందదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నప్పటికీ ఈ అబద్ధపు ప్రచారం మాత్రం ఆగటం లేదు. మరోవైపు బ్రాయిలర్ కోడి తయారు కావటానికి కిలోకు 70 నుంచి 75 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నిర్వహణ ఖర్చులు, పెట్టుబడులకు వడ్డీలు కలుపుకుంటే ఇంకా ఎక్కువతుంది. గత ఏడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరి నెలల్లో సగటున 90 రూపాయలకు తగ్గకుండా ధర పలికింది. ఒక దశలో వంద రూపాయలు కూడా వచ్చింది. జనవరి నెల చివర నుంచి మార్కెట్ దిగజారటం ప్రారంభమైంది. ఆ నెలాఖరుకు 85 రూపాయలకు పడిపోయింది.