కరోనా ఎఫెక్ట్ : అపోలో ఫీవర్‌ క్లినిక్స్‌ ప్రారంభం

| Edited By:

Apr 07, 2020 | 12:42 PM

కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో జ్వరం, సంబంధిత లక్షణాల గురించి ప్రజల ఆందోళనలను పరిష్కరించడానికి అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ యొక్క విభాగం అపోలో క్లినిక్స్ సోమవారం ప్రత్యేక క్లినిక్ లను

కరోనా ఎఫెక్ట్ : అపోలో ఫీవర్‌ క్లినిక్స్‌ ప్రారంభం
Follow us on

కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో జ్వరం, సంబంధిత లక్షణాల గురించి ప్రజల ఆందోళనలను పరిష్కరించడానికి అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ యొక్క విభాగం అపోలో క్లినిక్స్ సోమవారం ప్రత్యేక క్లినిక్ లను ప్రారంభించింది. తొలి దశలో హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లో 21 క్లినిక్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి. రెడ్డి తెలిపారు. తర్వాతి వారంలో వీటిని 50కి పెంచనున్నట్లు వివరించారు. ప్రత్యేక ఫీవర్‌ క్లినిక్స్‌లో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉంటాయని తెలిపారు.