
Coronavirus Cases: కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 3,261,641 కు చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 230,388 మంది ప్రాణాలు కోల్పోగా..1,029,477 మంది కోలుకున్నారు.
భారత్ లో ఇప్పటి వరకు 33,610 కరోనా కేసులు నమోదయ్యాయి. 8,373 మంది ప్రాణాలు కోల్పోగా, 5, 914 మంది కోలుకున్నారు.