దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం.. ఢిల్లీలో హెల్త్‌కేర్ వర్కర్స్ పేర్ల నమోదు ప్రక్రియ షురూ..!

|

Dec 05, 2020 | 1:49 PM

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి త్వరలో విముక్తి కలుగుతుందన్న వార్తల నేపథ్యంలో అయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందుగా ఎవరెవరికీ వ్యాక్సిన్ అందించాలన్న దానిపై కసరత్తు మొదలు పెట్టాయి.

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం.. ఢిల్లీలో హెల్త్‌కేర్ వర్కర్స్ పేర్ల నమోదు ప్రక్రియ షురూ..!
Follow us on

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి త్వరలో విముక్తి కలుగుతుందన్న వార్తల నేపథ్యంలో అయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందుగా ఎవరెవరికీ వ్యాక్సిన్ అందించాలన్న దానిపై కసరత్తు మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా భారత్‌లోనూ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కేంద్రం. దేశ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, కేంద్రప్రభుత్వం కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ నేపధ్యంలోనే ప్రధాని ఆధ్వర్యంలో వైద్యఆరోగ్యశాఖ అధికారుల సమావేశం జరిగింది. దేశంలో కోటిమంది హెల్త్‌వర్కర్స్‌కు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. తరువాత రెండు కోట్లమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తరువాత 27 కోట్లమంది సీనియర్ సిటిజన్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ నేపధ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కోసం హెల్త్ వర్కర్స్ నమోదు ప్రక్రియ ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలోని హెల్త్‌కేర్ ఫెసిలిటీస్ అయిన ఇన్‌స్టిట్యూషన్, నర్సింగ్ హోం, ఓపీడీ, క్లీనిక్ మొదలైన వాటిల్లో పనిచేసే సిబ్బంది, తోపాటు హెల్త్‌కేర్ వర్కర్స్ పేర్లను పంపించాలని కోరింది.