Coronavirus: కరోనా వస్తుందని ముందే తెలుసా.. 2008లో రాసిన పుస్తకంలో..!

| Edited By:

Mar 04, 2020 | 10:43 PM

చైనాతో మొదలై ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనావైరస్ (కొవిడ్‌19) కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. దీన్ని ఎలా నివారించాలో తెలియక ప్రపంచదేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి వ్యాధి ఒకటి వస్తుందని

Coronavirus: కరోనా వస్తుందని ముందే తెలుసా.. 2008లో రాసిన పుస్తకంలో..!
Follow us on

Coronavirus: చైనాతో మొదలై ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనావైరస్ (కొవిడ్‌19) కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. దీన్ని ఎలా నివారించాలో తెలియక ప్రపంచదేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి వ్యాధి ఒకటి వస్తుందని కొందరు ముందుగానే గుర్తించారు. మొన్నామధ్య ‘ది ఐస్‌ ఆప్‌ డార్క్‌నెస్‌’ అనే పుస్తకంలో ఇలాంటి వైరస్‌ ఒకటి వస్తుందని రాసుంది. ఈ పుస్తకాన్ని డీన్‌నోట్జ్‌ అనే అమెరికన్‌ రచించారు.

కాగా.. సెల్వియా బ్రౌనే అనే మరో అమెరికన్‌ రచయిత కూడా ఈ విషయాన్నే ప్రస్తావించింది. ఆమె 2008లో రచించిన ‘ఎండ్‌ ఆఫ్‌ డేస్‌: ప్రెడిక్షన్స్ అండ్ ప్రొఫెసిస్’ అనే పుస్తకంలో ”2020వ సంవత్సరంలో ఒక ప్రమాదకరమైన వైరస్‌ ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. ఇది ఊపిరితిత్తులపైన, ఇతర శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దేశాలు దాని నియంత్రణకు ప్రయత్నించినప్పటికి దానంతట అదే మాయమౌతుంది. పదేళ్ల తర్వాత మరోసారి వచ్చి పూర్తిగా కనిపించకుండాపోతుంది” అని రాసింది. వైరల్‌గా మారిన ఆ పుస్తకాన్ని మీరు చూడండి.