Coronavirus Telangana: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోన్న ప్రైవేటు ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు ఆసుపత్రులపై వేటు వేసిన ప్రభుత్వం.. మిగతా ఆసుపత్రులు తమ తీరును మార్చుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని హాస్పిటల్స్ కు అయితే షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వైద్యాశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కరోనా చికిత్స కోసం 50 శాతం బెడ్స్ ప్రభుత్వానికి ఇచ్చేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు అంగీకరించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఈ బెడ్స్ ను కరోనా బాధితులకు కేటాయించనున్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లోని బెడ్స్ ను కరోనా పేషెంట్స్ కు వైద్యారోగ్య శాఖ ఇవ్వనుంది. కాగా, 50 శాతం బెడ్స్ ఇచ్చేందుకు అంగీకరించిన ప్రైవేట్ ఆసుపత్రులకు మంత్రి ఈటెల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. అటు గైడ్ లైన్స్ రూపొందించేందుకు ఆసుపత్రి యాజమాన్యాలు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో భేటీ కావాలని ఆయన కోరారు.
Also Read: