వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 6.06 లక్షలు..

Corona Cases In World: ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 14,525,908 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 606,718 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 8,665,911 ఈ వైరస్ బారి […]

వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 6.06 లక్షలు..
World Coronavirus

Updated on: Jul 19, 2020 | 10:13 PM

Corona Cases In World: ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 14,525,908 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 606,718 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 8,665,911 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో అత్యధికంగా 224,273 పాజిటివ్ కేసులు, 5,011 మరణాలు సంభవించాయి.

అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(3,859,590), మరణాలు(143,042) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 2,076,635 నమోదు కాగా, మృతుల సంఖ్య 78,871కు చేరింది. ఇక రష్యాలో 771,546 పాజిటివ్ కేసులు,12,342 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 1,113,400 నమోదు కాగా, మృతుల సంఖ్య 27,472కి చేరింది.