దేశంలో కరోనా.. 93,337 పాజిటివ్ కేసులు, 1,247 మరణాలు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 93,337 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,247 మరణాలు సంభవించాయి.

దేశంలో కరోనా.. 93,337 పాజిటివ్ కేసులు, 1,247 మరణాలు

Updated on: Sep 19, 2020 | 11:08 AM

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 93,337 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,247 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53,08,015కి చేరుకుంది. ఇందులో 10,13,964 యాక్టివ్ కేసులు ఉండగా.. 85,619 మంది కరోనాతో మరణించారు. అటు 42,08,432 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. (Coronavirus Positive Cases India)

ఇదిలా ఉంటే అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. అత్యధిక పాజిటివ్ కేసుల లిస్టులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. ఇక కోవిడ్ మరణాలు ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సంభవించాయి. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 79.28 శాతంలో ఉండగా.. డెత్ రేట్ 1.61 శాతంలో ఉంది.

Also Read:

Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

పశువులకు మరో అంతుచిక్కని వ్యాధి.. ఆందోళనలో రైతులు.!

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

Loading...
Unable to load recommendations.
Follow Us