Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 69,652 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 977 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 28,36,926కి చేరుకుంది. ఇందులో 6,86,395 యాక్టివ్ కేసులు ఉండగా.. 53,866 మంది కరోనాతో మరణించారు. అటు దేశంలో ఇప్పటివరకు 20,96,664 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.
ఇక అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల లిస్టులో మహారాష్ట్ర, న్యూఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత మూడు లక్షలు కరోనా కేసులు దాటిన మూడవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. అలాగే నిన్న మహారాష్ట్రలో అత్యధికంగా 13,165 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజు 9,18,470 కరోనా టెస్టులు చేయగా.. ఇప్పటివరకు మొత్తంగా 3,26,61,252 పరీక్షలు నిర్వహించారు. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 73.91 శాతం ఉండగా.. మరణాల రేటు 1.90 శాతంగా ఉంది.
Also Read:
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ‘వైఎస్సార్ ఆసరా’కు కేబినెట్ ఆమోదం..
మురుగునీటిలో కరోనా వైరస్.. తేల్చేసిన పరిశోధకులు..
డిలేట్ చేసిన వాట్సాప్ వీడియోలు, ఇమేజ్స్‌ను రికవర్ చేయండిలా..