
Coronavirus Positive Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9393 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 325396కు చేరింది. ఇందులో 87177 యాక్టివ్ కేసులు ఉండగా.. 235218 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా 95 మంది వైరస్ కారణంగా మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 3001కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 8,846 మంది కరోనాను జయించారు.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1357 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత పశ్చిమ గోదావరిలో 995, విశాఖలో 985, అనంతపురంలో 973 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు చిత్తూరులో 836, గుంటూరులో 443, కడపలో 434, కృష్ణాలో 195, కర్నూలులో 805, నెల్లూరులో 588, ప్రకాశంలో 635, శ్రీకాకుళంలో 762, విజయనగరంలో 385 కేసులు వచ్చాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.
Also Read:
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ‘వైఎస్సార్ ఆసరా’కు కేబినెట్ ఆమోదం..
మురుగునీటిలో కరోనా వైరస్.. తేల్చేసిన పరిశోధకులు..
డిలేట్ చేసిన వాట్సాప్ వీడియోలు, ఇమేజ్స్‌ను రికవర్ చేయండిలా..
#COVIDUpdates: 20/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 3,22,501 పాజిటివ్ కేసు లకు గాను
*2,32,323 మంది డిశ్చార్జ్ కాగా
*3,001 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 87,177#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/LvmUnvHui6— ArogyaAndhra (@ArogyaAndhra) August 20, 2020