దేశంలో కరోనా కల్లోలం.. ఒక్క రోజే 45,720 కేసులు, 1,129 మరణాలు..

|

Jul 23, 2020 | 9:55 AM

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 45,720 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,129 మరణాలు సంభవించాయి.

దేశంలో కరోనా కల్లోలం.. ఒక్క రోజే 45,720 కేసులు, 1,129 మరణాలు..
Follow us on

Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 45,720 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,129 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,38,635కి చేరుకుంది. ఇందులో 4,26,167 యాక్టివ్ కేసులు ఉండగా.. 29,861 మంది కరోనాతో మరణించారు. అటు 7,82,607 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుతో సహా 8 రాష్ట్రాల్లో నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ లిస్టులో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షల 40 వేలకు చేరువలో ఉండగా… వైరస్ కారణంగా 12,556 మంది మరణించారు. ఇక తమిళనాడులో లక్షా 86 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3144 మరణాలు సంభవించాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలో 1,26,323 కేసులు, 3719 మరణాలు సంభవించాయి. ఇక ఆ తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ మరణాలు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడులలో సంభవించాయి.

Also Read:

జగన్ సర్కార్ మరో సంచలనం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ..

Part 3: ”సుశాంత్‌ది హత్యేనా” ఆత్మ ఏం చెప్పింది.? షాకింగ్ వాస్తవాలు…