గుడ్ న్యూస్.. సెప్టెంబర్ చివరినాటికి తెలంగాణలో కరోనా తగ్గే ఛాన్స్.!

|

Aug 08, 2020 | 4:44 PM

తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ చివరినాటికి కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గే అవకాశం ఉందని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. కరోనా నివారణా చర్యలపై మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

గుడ్ న్యూస్.. సెప్టెంబర్ చివరినాటికి  తెలంగాణలో కరోనా తగ్గే ఛాన్స్.!
Follow us on

Coronavirus Pandemic: తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ చివరినాటికి కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గే అవకాశం ఉందని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. కరోనా నివారణా చర్యలపై మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోజూ 23 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని అన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందన్న ఆయన.. ఈ నెలాఖరుకు చాలావరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

అటు కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 100 కోట్ల నిధులను విడుదల చేసిందని శ్రీనివాసరావు తెలిపారు. కరోనాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన.. కరోనా రెండు వారాలు మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే వైరస్ సోకినవారికి హోం ఐసోలేషన్ కిట్లను వెంటనే ఇస్తున్నామని తెలిపారు. ప్రతీ జిల్లాలోనూ కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని.. మరణాల రేటును తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.

Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పనున్న జగన్ సర్కార్..!