దేశంలో కొత్తగా 45,882 పాజిటివ్ కేసులు, 584 మరణాలు.. రికవరీ రేటు 94 శాతం.!

దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 45,882 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 90,04,365కి చేరింది. చేరింది...

దేశంలో కొత్తగా 45,882 పాజిటివ్ కేసులు, 584 మరణాలు.. రికవరీ రేటు 94 శాతం.!

Updated on: Nov 20, 2020 | 10:46 AM

Corona Cases India: దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 45,882 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 90,04,365కి చేరింది. చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 4,43,794 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 84,28,409 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న దేశవ్యాప్తంగా 584 మంది మృతి చెందటంతో మొత్తం ఇప్పటివరకు వైరస్ కారణంగా 1,32,162 మంది ప్రాణాలు కోల్పోయారు.

అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 44,807 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. అటు నిన్న 10,83,397 టెస్టులు చేయగా.. మొత్తం దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య 12.95 కోట్లకు చేరింది. దేశంలో సుమారు 93.60 శాతానికి రికవరీ రేటు చేరిందంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 4.93 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.47 శాతానికి తగ్గింది.

Also Read:

జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!

ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..

Follow Us