Coronavirus Cases In AP: ఏపీలో డబుల్ డిజిట్‌కు పడిపోయిన కోవిడ్ పాజిటివ్ కేసులు.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 64 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 64 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,87,900కి చేరింది. ఇందులో..

Coronavirus Cases In AP: ఏపీలో డబుల్ డిజిట్‌కు పడిపోయిన కోవిడ్ పాజిటివ్ కేసులు.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 64 పాజిటివ్ కేసులు
Coronavirus Cases In AP

Updated on: Feb 01, 2021 | 5:38 PM

Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 64 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,87,900కి చేరింది. ఇందులో 1242 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,79,504 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న కోవిడ్ వైరస్ కారణంగా రాష్ట్రంలో ఒకరు మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 7,154కు చేరుకుంది. ఇక నిన్న 99 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,31,59,794 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 4, చిత్తూరు 4, తూర్పుగోదావరి 15, గుంటూరు 7, కడప 4, కృష్ణా 9, కర్నూలు 2, నెల్లూరు 8, శ్రీకాకుళం 1, విశాఖపట్నం 10 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇదిలావుంటే గత రెండు నెలల క్రితం రాష్ట్రంలో అధిక కేసులు నమోదైన కొన్ని జిల్లాలో ఇప్పుడు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయి. ప్రకాశం, విజయనగరం , పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

 

ఇవి కూడా చదవండి : 

Captain Tom Moore : వన్ మాన్ ఫండ్ రైజింగ్ మెషిన్‌కు కరోనా పాజిటివ్.. బెడ్‌ఫోర్డ్ ఆసుపత్రిలో చికిత్స

Bandi Sanjay : మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలా నిర్మలమ్మ బడ్జెట్.. పొగచూరిన జీవితాలకు ఇది వెలుగు రేఖ..