Coronavirus cases in Quthbullapur: ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మరోవైపు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆదివారం అత్యధికంగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీడిమెట్ల పరిధిలోని వివిధ కాలనీల్లో 6 కేసులు నమోదవగా, జగద్గిరిగుట్టలో 5 పాజిటివ్ కేసులు వచ్చాయి. నిజాంపేట్ లో 5 కేసులు నమోదవగా, ప్రగతి నగర్ లో 3, చింతల్ లో 3 కరోనా కేసులు వచ్చాయి. కొంపల్లి, బాచుపల్లి, షాపూర్ నగర్ లలో రెండేసి కేసులు నమోదయ్యాయి. సుచిత్ర, గాజులరామరం, గండి మైసమ్మ లో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 32 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.