2021కి భారత్‌లో కరోనా వ్యాక్సిన్.. కానీ అదే పెద్ద సవాల్.!

|

Sep 22, 2020 | 4:04 PM

కరోనా వైరస్ వ్యాక్సిన్ భారత్‌లో వచ్చే ఏడాదికి అందుబాటులోకి వస్తుందని.. అయితే దాన్ని దేశంలో 130 కోట్ల మందికి అందించడమే పెద్ద సవాలుగా మారనుందని...

2021కి భారత్‌లో కరోనా వ్యాక్సిన్.. కానీ అదే పెద్ద సవాల్.!
Follow us on

కరోనా వైరస్ వ్యాక్సిన్ భారత్‌లో వచ్చే ఏడాదికి అందుబాటులోకి వస్తుందని.. అయితే దాన్ని దేశంలో 130 కోట్ల మందికి అందించడమే పెద్ద సవాలుగా మారనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలు గగన్ దీప్ కాంగ్ వెల్లడించారు. ఆమె ఇటీవల కరోనా వ్యాక్సిన్‌పై మీడియాతో మాట్లాడుతూ.. ”వచ్చే ఏడాది ప్రారంభానికి కొన్ని కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం మూడో దశ ట్రయిల్స్‌లో ఉన్న వ్యాక్సిన్లలో 50 శాతం మాత్రమే సక్సెస్ కావొచ్చు. అంతేకాదు అధిక సంఖ్యలో కరోనా వ్యాక్సిన్లు కావాలంటే వచ్చే ఏడాది చివరి వరకు వేచి చూడాలి” అని గగన్ దీప్ కాంగ్ అభిప్రాయపడ్డారు. (Corona Vaccine In India)

భారత్‌లో ఉన్న 130 కోట్ల మంది జనాభాకు కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడం పెద్ద సవాల్‌గా మారుతుందని ఆమె అన్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావం వృద్దులలో తీవ్రస్థాయిలో ఉంది.. వారికి వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు భారత ప్రభుత్వం సరైన వ్యవస్థను నిర్మించాలి. అటు దేశంలో యాంటీజన్ టెస్టులు పెంచినప్పటికీ.. డబ్ల్యూహెచ్‌ఓ కరోనా నివారణకు విధించిన ఐదు శాతం కంటే వైరస్ పాజిటివిటీ రేట్ భారత్‌లో ఎనిమిది శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆమె అన్నారు.

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..