
Corona Tests In GHMC: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని బస్తీవాసులకు, పేదలకు ఆసుపత్రులకు వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే కరోనా టెస్టులు నిర్వహించేందుకు ప్రత్యేక మొబైల్ వాహనాలను తిరుగుతున్నాయి. వీటి గురించి అందరికీ తెలిసే విధంగా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ప్రకటనలను చేస్తోంది.
ఈ మొబైల్ టెస్టింగ్ వాహనాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరోనా టెస్టులు నిర్వహిస్తారని జీహెచ్‌ఎంసీ సిబ్బంది చెబుతున్నారు. పెద్దలకు ముక్కులో, పిల్లలకు గొంతులో పరీక్ష నమూనాలను తీసుకుంటారని తెలిపారు. కాగా, తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరీక్షల కోసం ఆసుపత్రుల్లో గంటల తరబడి ఎదురుచూసే పని లేకుండా ఇప్పుడు ఇంటి దగ్గరే పరీక్షలు నిర్వహించడంతో సౌకర్యంగా ఉందని బస్తీవాసులు చెబుతున్నారు.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!