Corona positive to priest: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. కనకదుర్గమ్మ ఆలయంలో ఒక అర్చకునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వెంటనే ఆలయంలో శానిటైజేషన్ కార్యక్రమాలు పూర్తి చేశారు. లక్ష కుంకుమార్చనలో బాధిత అర్చకుడు విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అర్చకుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. పాజిటివ్ వచ్చిన అర్చకుడిని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు.
Also Read: వావ్.. ఎయిర్ ఫోర్స్ కు ఎంపికైన చాయ్ వాలా కూతురు..