
ఐఐటీ మద్రాస్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ క్యాంపస్‌లో రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో విద్యార్థులతోపాటు అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థులకు కోవిడ్ సోకిందని తెలియడంతో వారి తల్లిదండ్రుల్లో టెన్షన్ నెలకొంది.
అయితే గత 15 రోజుల్లోనే 183 మంది విద్యార్థులు కోవిడ్ బారీనపడినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా సోకిన విద్యార్తులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ సోకిన విద్యార్థులతో సన్నిహితంగా ఉన్నటువంటి మిగిలిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగటివ్ వచ్చినవారిని ఐసోలేషన్‌కు తరలించారు.
క్యాంపస్‌లో అకడమిక్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. హాస్టల్లోని విద్యార్థులు బయటకు రావద్దని వర్శిటి పాలక మండలి ఆదేశించింది. ఇక ముందు ఇళ్ల నుంచే ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ప్రొఫెసర్లకు సూచించింది.